Enni Pakistanulu
₹
360
₹ 298.8 (17% off)
Available
ఎన్ని పాకిస్తానులు? ఈ నవలలో నాయకుడో, మహానాయకుడో ఎదురుగాలేడు. అందువల్ల కాలాన్నే నాయకుడుగా, మహానాయకుడుగా, విలన్గా ఊహించుకున్నాడు రచయిత శ్రీకమలేశ్వర్. "ఆగ్రా నా రాజధాని. ఆలోచించండి. ఆసమయంలో హిందువులు కృష్ణుణ్ని దేవునిగా, అవతార పురుషునిగా కొలిచేవారు. అతని జన్మస్థానం మధుర. నా రాజధాని ఆగ్రానుండి కేవలం యాభై కిలోమిటర్ల దూరం. కూల్చాలనుకొంటే కృష్ణుని జన్నస్థానం కూల్చలేనా? పరుగెత్తి పరుగెత్తి అయోధ్యవరకు వెళ్లి రాముని జన్మస్థానాన్ని ఎందుకు కూలుస్తా? నలుగురు పిచ్చోళ్ల గురించి నేను తెలుసుకున్న సమాచారం గురించి విన్నవిస్తాను వినండి. అందరికంటే పెద్ద పిచ్చోడు మహాత్మాగాంధీ. రెండో పిచ్చోడు నేతాజీ సుభాష్ చంద్రబోసు. మూడో పిచ్చోడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. నాలుగో పిచ్చోడు ఒక అదీబ్". వయోవృద్ధ బోధివృక్షం మాట్లాడ సాగింది - ఆర్యుల వర్ణవాదం అప్రాకృతికమైన సిద్ధాంతం. ఎందుకంటే బ్రాహ్మణుల భార్యలు కూడా నెలనెలా బహిష్టుతో బాధ పడుతున్నవారే. వాళ్లూ గర్భవతులవుతున్నారు. వాళ్లూ పిల్లల్ని కంటున్నారు. వాళ్లకు పాలిస్తూ పోషిస్తున్నారు. బ్రాహ్మణులు స్త్రీల గర్భంలో జన్మించినప్పటికీ బ్రహ్మనోటిలో జన్మించామని వాదిస్తారు. బ్రహ్మనోటిలో గర్భాశయం ఎక్కడుంది? రాత్రిసమయంలో ఔరంగజేబు తన విశ్వసనీయుడైన హంతకుడు నజర్ కుతీ బేగును పిలిపించారు. ఆ గూనివాడు వచ్చి నమస్కరిస్తే, "ఖవాసుపుర భవనంలోకి వెళ్లి, సిపిహర్షికోను తండ్రి నుండి వేరు చేయి. ఆ కాఫిర్ దారాషికో తలనరికి, ఆ తల తెచ్చి నాకు చూపించు" అన్నారు ఔరంగజేబు. హంతకుడు నజర్ బేగును చూసి, "ఈ వేళప్పుడు నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావు?" అన్నాడు దారాషికో. “సిపిహర్షికోను నీనుండి వేరు చేయమని ఉత్తర్వు". అన్నాడు నజర్ బేగు. ఈ మాట విన్న సిపిహర్ షికో జాగరూకుడయ్యాడు. “మమ్మల్ని చంపడానికి నిన్ను పంపారా?" దార కఠినంగా అడిగాడు. హంతకులిద్దరూ బయట నిరీక్షిస్తున్న సైనికులకు సిపిహర్షికోను అప్పగించి దారాషికో ఉన్న గదిలోకి వెళ్ళి తలుపు మూశారు. బయట సిపిహర్షికో వేస్తున్న కేకలు వినిపిస్తున్నాయి. అప్పుడే కోర్టు మీద చీకటి అలముకోసాగింది.
Read moreAbout the Book
ఎన్ని పాకిస్తానులు?
ఈ నవలలో నాయకుడో, మహానాయకుడో ఎదురుగాలేడు. అందువల్ల కాలాన్నే నాయకుడుగా, మహానాయకుడుగా, విలన్గా ఊహించుకున్నాడు రచయిత శ్రీకమలేశ్వర్.
"ఆగ్రా నా రాజధాని. ఆలోచించండి. ఆసమయంలో హిందువులు కృష్ణుణ్ని దేవునిగా, అవతార పురుషునిగా కొలిచేవారు. అతని జన్మస్థానం మధుర. నా రాజధాని ఆగ్రానుండి కేవలం యాభై కిలోమిటర్ల దూరం. కూల్చాలనుకొంటే కృష్ణుని జన్నస్థానం కూల్చలేనా? పరుగెత్తి పరుగెత్తి అయోధ్యవరకు వెళ్లి రాముని జన్మస్థానాన్ని ఎందుకు కూలుస్తా?
నలుగురు పిచ్చోళ్ల గురించి నేను తెలుసుకున్న సమాచారం గురించి విన్నవిస్తాను వినండి. అందరికంటే పెద్ద పిచ్చోడు మహాత్మాగాంధీ. రెండో పిచ్చోడు నేతాజీ సుభాష్ చంద్రబోసు. మూడో పిచ్చోడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. నాలుగో పిచ్చోడు ఒక అదీబ్".
వయోవృద్ధ బోధివృక్షం మాట్లాడ సాగింది - ఆర్యుల వర్ణవాదం అప్రాకృతికమైన సిద్ధాంతం. ఎందుకంటే బ్రాహ్మణుల భార్యలు కూడా నెలనెలా బహిష్టుతో బాధ పడుతున్నవారే. వాళ్లూ గర్భవతులవుతున్నారు. వాళ్లూ పిల్లల్ని కంటున్నారు. వాళ్లకు పాలిస్తూ పోషిస్తున్నారు. బ్రాహ్మణులు స్త్రీల గర్భంలో జన్మించినప్పటికీ బ్రహ్మనోటిలో జన్మించామని వాదిస్తారు. బ్రహ్మనోటిలో గర్భాశయం ఎక్కడుంది?
రాత్రిసమయంలో ఔరంగజేబు తన విశ్వసనీయుడైన హంతకుడు నజర్ కుతీ బేగును పిలిపించారు. ఆ గూనివాడు వచ్చి నమస్కరిస్తే, "ఖవాసుపుర భవనంలోకి వెళ్లి, సిపిహర్షికోను తండ్రి నుండి వేరు చేయి. ఆ కాఫిర్ దారాషికో తలనరికి, ఆ తల తెచ్చి నాకు చూపించు" అన్నారు ఔరంగజేబు.
హంతకుడు నజర్ బేగును చూసి, "ఈ వేళప్పుడు నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావు?" అన్నాడు దారాషికో.
“సిపిహర్షికోను నీనుండి వేరు చేయమని ఉత్తర్వు". అన్నాడు నజర్ బేగు. ఈ మాట విన్న సిపిహర్ షికో జాగరూకుడయ్యాడు.
“మమ్మల్ని చంపడానికి నిన్ను పంపారా?" దార కఠినంగా అడిగాడు.
హంతకులిద్దరూ బయట నిరీక్షిస్తున్న సైనికులకు సిపిహర్షికోను అప్పగించి దారాషికో ఉన్న గదిలోకి వెళ్ళి తలుపు మూశారు. బయట సిపిహర్షికో వేస్తున్న కేకలు వినిపిస్తున్నాయి.
అప్పుడే కోర్టు మీద చీకటి అలముకోసాగింది.
Book Details
Customer Reviews
Be the first to write a review...
ఎన్ని పాకిస్తానులు ఒక సాధారణ నవల కాదు—ఇది చరిత్రను విచారించే ఒక సాహిత్య న్యాయస్థానం. ప్రముఖ హిందీ రచయిత కమలేశ్వర్ రచించిన ఈ కృతి, దేశాల విభజనలు, మతపరమైన విభేదాలు, రాజకీయ నిర్ణయాలు మనిషి జీవితాన్ని ఎలా చీల్చాయో ప్రశ్నిస్తుంది.
ఈ నవలలో ఒక హీరో లేడు. కాలమే ఇక్కడ నాయకుడు, విలన్, సాక్షి. చరిత్రలో జరిగిన సంఘటనలు—ముఖ్యంగా భారత విభజన (Partition)—మాత్రమే కాదు, మానవ సమాజంలో విభజన అనే భావన ఎలా పునరావృతమవుతుందో ఈ కథ చూపిస్తుంది.
ఆలోచనాత్మక సంభాషణలు, వ్యంగ్యం, మరియు చారిత్రక సూచనల ద్వారా రచయిత ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతాడు:
మనుషులు దేశాలను ఎందుకు విభజిస్తారు? మరియు ఆ నిర్ణయాల భారాన్ని ఎవరు మోస్తారు?
తెలుగు అనువాద రూపంలో అందుబాటులో ఉన్న ఈ నవల, సాహిత్య గంభీరతను మరియు సామాజిక సత్యాన్ని కలిపిన అరుదైన అనుభవం.
ఎన్ని పాకిస్తానులు చదవడం అంటే చరిత్రను చదవడం కాదు—దాన్ని ప్రశ్నించడం.
‘ఎన్ని పాకిస్తానులు’ నవల ఏమి గురించి ఉంది?
ఈ నవల మతం, దేశ విభజన, రాజకీయ నిర్ణయాలు మరియు మానవ సమాజంపై వాటి ప్రభావం గురించి. ఇది చరిత్రను ప్రశ్నించే ఒక ఆలోచనాత్మక కథ.
ఈ నవలలో ప్రధాన పాత్ర ఎవరు?
ఈ నవలలో ఒక వ్యక్తి హీరోగా ఉండదు. కాలమే (Time) ఇక్కడ ప్రధాన పాత్రగా ఉంటుంది.
ఈ పుస్తకం Partition గురించి మాత్రమేనా?
కాదు. Partition ఒక ప్రధాన అంశం అయినప్పటికీ, ఈ నవల విభజన అనే భావనను విశాలంగా పరిశీలిస్తుంది—మతం, జాతి, దేశం అనే కోణాల్లో.
ఈ పుస్తకం ఎందుకు ప్రత్యేకం?
ఇది ఒక కథలా కాకుండా, చరిత్రను విచారణకు పెట్టే విధంగా ఉంటుంది. ఇది వాస్తవాలు, తత్త్వం, మరియు సాహిత్యాన్ని కలిపిన కృతి.
ఈ పుస్తకం ఎవరు చదవాలి?
- గంభీర సాహిత్యం ఇష్టపడే పాఠకులు
- చరిత్ర మరియు రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు
- విద్యార్థులు మరియు పరిశోధకులు
- Partition మరియు సామాజిక విభజనపై చదవాలనుకునేవారు
